అమరావతి, 10 సెప్టెంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్‌కు చేరుకున్నారు. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారి వివరాలు తెలుసుకున్నారు. అక్కడి అధికారులు లోకేష్‌కు వివరాలు తెలియజేశారు. ఇప్పటివరకు 215 మంది తెలుగువారు నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఈ సమస్యపై నారా లోకేష్ సత్వరమే స్పందించి పరిష్కారం దిశగా కృషి చేస్తున్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ