నా చుట్టూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.. నేపాల్ నుంచి మడభూషి శ్రీధర్ వీడియో రిలీజ్
హైదరాబాద్, 11 సెప్టెంబర్ (హి.స.) నేపాల్ లో చిక్కుకుపోయిన తెలుగువారిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రత్యేక హెల్ప్ లైన్ లను ఏర్పాటు చేసిన ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు పరిస్థితిన
నేపాల్


హైదరాబాద్, 11 సెప్టెంబర్ (హి.స.)

నేపాల్ లో చిక్కుకుపోయిన తెలుగువారిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రత్యేక హెల్ప్ లైన్ లను ఏర్పాటు చేసిన ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నాయి. ఈ క్రమంలో నేపాల్ పర్యటనకు వెళ్లి అక్కడ ఆందోళన కారణంగా చిక్కుకుపోయిన వరంగల్ జిల్లాకు చెందిన కేంద్ర సమాచార మాజీ కమిషనర్, నల్సార్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ మడభూషి శ్రీధర్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం తాను ఖాట్మండులో చిక్కుకుపోయానని చెప్పారు. అదృష్టం కొద్ది తమకు ఖాట్మండులోనే ఓ చిన్న హోటల్ లో ఉన్నామని ప్రస్తుతానికి సురక్షితంగా ఉన్నామని చెప్పారు. మా చుట్టూ అంతా పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అయితే మేమున్నచోటే ఏమి కాదని అందరూ చెబుతున్నారని అందువల్ల మేము ఇక్కడే ఎదురు చూస్తున్నామని వీడియోలో వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande