విజయవాడ లోని ఆర్ ఆర్ పేటలో డయేరియా.బాధితులు 46 మంది చికిత్స
అమరావతి, 11 సెప్టెంబర్ (హి.స.) విజయవాడ: నగరంలోని ఆర్‌ఆర్‌పేటలో డయేరియా బాధితులు 46 మంది చికిత్స పొందుతున్నారని మంత్రి నారాయణ తెలిపారు (. చికిత్స పొందుతున్న వారంతా ప్రస్తుతం కోలుకుంటున్నారని చెప్పారు. విజయవాడలోని న్యూరాజరాజేశ్వరిపేటలో ఆయన పర్యటించారు
విజయవాడ లోని ఆర్ ఆర్ పేటలో  డయేరియా.బాధితులు 46 మంది చికిత్స


అమరావతి, 11 సెప్టెంబర్ (హి.స.)

విజయవాడ: నగరంలోని ఆర్‌ఆర్‌పేటలో డయేరియా బాధితులు 46 మంది చికిత్స పొందుతున్నారని మంత్రి నారాయణ తెలిపారు (. చికిత్స పొందుతున్న వారంతా ప్రస్తుతం కోలుకుంటున్నారని చెప్పారు. విజయవాడలోని న్యూరాజరాజేశ్వరిపేటలో ఆయన పర్యటించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే బొండా ఉమా, వీఎంసీ కమిషనర్‌ ధ్యానచంద్ర ఉన్నారు. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో పరిస్థితిని మంత్రి పరిశీలించారు.

స్థానిక మెడికల్‌ క్యాంపులో బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. డీఎంహెచ్‌వో సుహాసిని, మున్సిపల్ అధికారులతో చర్చించారు. కొత్త ప్రభుత్వాసుపత్రిలో రోగులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్‌ఆర్‌పేటలో నీరు కలుషితమైందా లేదా అనేది పరిశీలిస్తున్నట్లు చెప్పారు. స్థానికంగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాగునీటి పరీక్షలో ఏ లోపం కనిపించలేదని.. రెండోసారి పరీక్షిస్తున్నట్లు వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande