నేర రహిత సమాజానికి సీసీ కెమెరాలు చాలా ముఖ్యం : సిద్దిపేట పోలీస్ కమిషనర్
హైదరాబాద్, 11 సెప్టెంబర్ (హి.స.) సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు తగ్గుతాయని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బీ. అనురాధ అన్నారు. గురువారం కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన 30 సీసీ కెమెరాలను సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి తో
సిద్దిపేట సిపి


హైదరాబాద్, 11 సెప్టెంబర్ (హి.స.)

సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు

తగ్గుతాయని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బీ. అనురాధ అన్నారు. గురువారం కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన 30 సీసీ కెమెరాలను సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ అనురాధ మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చు అని ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అని జిల్లాలో నేరాలు అదుపు చేయడానికి పోలీసులతో పాటు గ్రామ పెద్దలు, గ్రామ ప్రజా ప్రతినిధులు, వ్యాపారస్తులను భాగస్వామ్యం చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande