గుంటూరు జిల్లా తురకపాలెం లో..మిస్టరీ మరణాలు.ఆర్ ఎంపీ క్లినిక్. సీజ్
అమరావతి, 11 సెప్టెంబర్ (హి.స.) తురకపాలెం: గుంటూరు జిల్లా తురకపాలెంలో మిస్టరీ మరణాలను అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇక్కడి ఆర్‌ఎంపీ క్లినిక్‌ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి సీజ్‌ చేశారు. మృత్యువాత పడినవారిలో కొందరు మొదట్లో ఆర్‌ఎంప
గుంటూరు జిల్లా తురకపాలెం లో..మిస్టరీ మరణాలు.ఆర్ ఎంపీ క్లినిక్. సీజ్


అమరావతి, 11 సెప్టెంబర్ (హి.స.)

తురకపాలెం: గుంటూరు జిల్లా తురకపాలెంలో మిస్టరీ మరణాలను అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇక్కడి ఆర్‌ఎంపీ క్లినిక్‌ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి సీజ్‌ చేశారు. మృత్యువాత పడినవారిలో కొందరు మొదట్లో ఆర్‌ఎంపీ వద్దే చికిత్స పొందినట్లు ఆధారాలు ఉన్నాయి. బాధితులకు అధిక మోతాదులో యాంటీబయాటిక్స్‌ ఇచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. అధికంగా సెలైన్ల వాడకం కూడా ఇన్‌ఫెక్షన్‌కు కారణమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌ఎంపీ క్లినిక్‌ను సీజ్‌ చేసి విచారణ చేపట్టారు.

గుంటూరు రూరల్‌ మండలం తురకపాలెం ప్రాణభయంతో విలవిల్లాడుతోంది. దాదాపు మూడు వేల జనాభా ఉన్న ఆ గ్రామంలో గత ఐదు నెలల్లో 28 మరణాలు సంభవించినట్లు అధికారులు ఇటీవల వెల్లడించారు. జులై, ఆగస్టు నెలల్లోనే 20 మంది వరకు మరణించారు. గ్రామంలోని పలువురు ప్రమాదకరమైన ఇన్‌ఫెక్షన్‌ మెలియాయిడోసిస్‌తో ఇబ్బంది

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande