హైదరాబాద్, 11 సెప్టెంబర్ (హి.స.)
ఇప్పుడున్న రాష్ట్ర కమిటీతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే బిజెపి తెలంగాణలో ఎప్పటికీ అధికారంలోకి రాదని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీలో పార్టీ కోసం కష్టపడే అందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర కమిటీలో పేరు లేదని బాధపడొద్దని సూచించారు. పార్టీలో ఇంకా 650 పోస్టులు ఉన్నాయని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు