తనకు అవకాశం ఇస్తే.. జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తా.. దానం నాగేందర్
హైదరాబాద్, 11 సెప్టెంబర్ (హి.స.) జూబ్లీహిల్స్ ఉప ఉన్నికపై ఇప్పటికే ప్రధాన పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఈ మేరకు ముఖ్య నేతలు నియోజకవర్గంపై వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ ఎన్నికలకు కేడర్ను సమాయత్తం చేస్తున్నారు. అదేవిధంగా అభ్యర్థులు ఎంపికలో మాత్రం సస్పెన్స్
దానం నాగేందర్


హైదరాబాద్, 11 సెప్టెంబర్ (హి.స.)

జూబ్లీహిల్స్ ఉప ఉన్నికపై ఇప్పటికే ప్రధాన పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఈ మేరకు ముఖ్య నేతలు నియోజకవర్గంపై వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ ఎన్నికలకు కేడర్ను సమాయత్తం చేస్తున్నారు. అదేవిధంగా అభ్యర్థులు ఎంపికలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సరైన అభ్యర్థినే ఎంపిక చేస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. ఇప్పుడున్న తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవడం చాలా ముఖ్యమని అన్నారు. తనకు అవకాశం ఇస్తే.. జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తానని కామెంట్ చేశారు.

కాగా, ఏఐసీసీ అగ్ర నేతలను ఎమ్మెల్యే దానం నాగేందర్ కలిసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. కేబినెట్ విస్తరణలో తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మూడు మంత్రి పదవులను ఇటీవల హై కమాండ్.. మిగిలిన పదవులను కూడా భర్తీ చేయడానికి కసరత్తు చేస్తున్న వేళ దానం ఢిల్లీకి వెళ్లాలని అనుకోవడం ప్రధాన్యతను సంతరించుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande