సిరిసిల్లలో ఉద్రిక్తత.. ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి యత్నం.. విద్యార్థి నేతల అరెస్ట్
రాజన్న సిరిసిల్ల, 11 సెప్టెంబర్ (హి.స.) రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, కలెక్టరేట్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో పోలీసులక
ఏబీవీపీ


రాజన్న సిరిసిల్ల, 11 సెప్టెంబర్ (హి.స.) రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, కలెక్టరేట్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు ఏబీవీపీ నాయకులకు మధ్య వాగ్వివాదం ఏర్పడింది. దాంతో ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయంబర్స్మెంట్ ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మద్యానికి మంత్రి ఉన్నాడు తప్ప, విద్యా శాఖకు మంత్రి లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ పాఠశాలలు బర్లకొట్టాల కన్నా హీనంగా ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, లేనియెడల ముఖ్యమంత్రితో సహా ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులను అడ్డుకుంటామని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande