ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులు పరిశీలించిన సిద్దిపేట కలెక్టర్
సిద్దిపేట, 11 సెప్టెంబర్ (హి.స.) సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని తంగళ్లపల్లి గ్రామ శివారులో దాదాపు 23 ఎకరాల విస్తీర్ణంలో 200 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను గురువారం జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీల
సిద్దిపేట కలెక్టర్


సిద్దిపేట, 11 సెప్టెంబర్ (హి.స.)

సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని తంగళ్లపల్లి గ్రామ శివారులో దాదాపు 23 ఎకరాల విస్తీర్ణంలో 200 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను గురువారం జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ స్థలం చుట్టూ సర్వే చేసి హద్దులు వెయ్యాలని తహసీల్దార్ ను ఆదేశించారు. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలించారు. విద్యార్థులకు సరిపడినంత, రుచికరమైన ఆహారాన్ని అందించాలని, ఎదిగే పిల్లలకు బలవర్ధక ఆహారాన్ని అందించాలని ప్రిన్సిపల్ ను ఆదేశించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande