బాసర సరస్వతి అమ్మవారి సేవలో మంత్రి జూపల్లి..
నిర్మల్, 10 సెప్టెంబర్ (హి.స.) ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీజ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి సన్నిధిలో రాష్ట్ర ఎక్సైజ్ టూరిజం శాఖ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక కుంకుమార్చన పూజలు చేశారు. ఈ రోజు హైదరాబాద్ నుండి బ
మంత్రి జూపల్లి


నిర్మల్, 10 సెప్టెంబర్ (హి.స.)

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీజ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి సన్నిధిలో రాష్ట్ర ఎక్సైజ్ టూరిజం శాఖ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక కుంకుమార్చన పూజలు చేశారు. ఈ రోజు హైదరాబాద్ నుండి బాసర చేరుకున్న మంత్రి జూపల్లికి ఎమ్మెల్సీ దండేవిటల్, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్, విట్టల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సాదర స్వాగతం పలికారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు అర్చకులు మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధి లో మంత్రి జూపల్లి కృష్ణారావు చే ప్రత్యేక కుంకుమార్చన పూజను ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాటాక్, ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి వేద పండితులు ఘనంగా జరిపించారు. అనంతరం ఆశీర్వచన మండపంలో మంత్రి జూపల్లి కృష్ణారావును శాలువాతో సత్కరించి అమ్మ వారి తీర్థప్రసాదాలు అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande