మహబూబాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.)
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్
శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వాహనాల ప్రత్యేక తనిఖీలలో భాగంగా బుధవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి జయపాల్ రెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ తనిఖీల్లో పలువాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, బీమా పత్రాలు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్సులు తదితర వివరాలను పరిశీలించారు.
నిబంధనలు పాటించని వాహనదారుల పై కేసులు నమోదు చేయడంతో పాటు కొన్నివాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా రవాణా నిబంధనలు పాటించాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు