సాంకేతిక. పరిజ్ఞానం ద్వారా ఏనుగులకు చెక్
చిత్తూరు11 సెప్టెంబర్ (హి.స.) పలమనేరు కుంకీ ఏనుగుల ద్వారా అడవి ఏనుగులను నిలువరించే విధానం రాష్ట్రంలో అమలవుతోంది. జిల్లా పలమనేరు మండలం ముసలిమడుగు శిబిరంలోని 6 కుంకీలతో అడవి ఏనుగులను పంటల మీద పడకుండా అధికారులు దారి మళ్లిస్తున్నారు. ఏనుగుల సమాచారం తెలు
సాంకేతిక. పరిజ్ఞానం ద్వారా ఏనుగులకు చెక్


చిత్తూరు11 సెప్టెంబర్ (హి.స.)

పలమనేరు కుంకీ ఏనుగుల ద్వారా అడవి ఏనుగులను నిలువరించే విధానం రాష్ట్రంలో అమలవుతోంది. జిల్లా పలమనేరు మండలం ముసలిమడుగు శిబిరంలోని 6 కుంకీలతో అడవి ఏనుగులను పంటల మీద పడకుండా అధికారులు దారి మళ్లిస్తున్నారు. ఏనుగుల సమాచారం తెలుసుకునేందుకు కొత్త విధానాలను అనుసరించాలని అటవీ శాఖ యోచిస్తోంది. రేడియో కాలర్లను అమర్చి ఏనుగులను గుర్తించే ప్రక్రియను పశ్చిమ బెంగాల్‌లో విజయవంతంగా అనుసరిస్తున్నారు. వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సూచనల మేరకు ఈ విధానాన్ని రాష్ట్రంలో సైతం అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఆర్థిక సహకారాన్ని అందించేందుకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ సంస్థ గతంలో అంగీకరించింది. ప్రస్తుతం పలమనేరు, కుప్పం నియోజకవర్గాల పరిధిలోని అడవిలో మొత్తం 100 ఏనుగులు ఉన్నాయని అంచనా. అవి నాలుగు బృందాలుగా విడిపోయి సంచరిస్తున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande