హైదరాబాద్, 11 సెప్టెంబర్ (హి.స.)
గ్రూప్-1 పరీక్షను తిరిగి నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్వీ నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అరెస్టు చేసిన విద్యార్థి నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా పాలన అంటే పోలీసులతో అరెస్టులు చేయించడమా..? అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
గ్రూప్-1 అవకతవకలపై వెంటనే సీబీఐ దర్యాప్తు చేయాలి. కేసీఆర్ హయాంలో లక్షా 62 వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు జరిగాయి. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకే ఈ ప్రభుత్వం ఉద్యోగాలిచ్చింది.. అబద్దాలు చెబుతూ కాంగ్రెస్ నేతలు కాలక్షేపం చేస్తున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాల భర్తీపై మాట తప్పారు. వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలి. విద్యార్థుల అక్రమ నిర్బంధాన్ని ఆపాలి అని డిమాండ్ చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..