హైదరాబాద్11 సెప్టెంబర్ (హి.స.), హైదరాబాద్- మూసాపేట,: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఓ మహిళ దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న యువకుడు.. మరొకరు కలిసి ఆమెను చేతులు, కాళ్లు తాళ్లతో కట్టేసి.. చిత్రహింసలు పెడుతూ.. తలపై కుక్కర్‌తో కొట్టి హత్య చేశారు. భారీగా నగదు, బంగారం దోచుకెళ్లారు. హత్య చేశాక.. అదే ఇంట్లో తాపీగా స్నానం చేసి.. యజమానికి చెందిన ద్విచక్ర వాహనంపైనే పరారయ్యారు. కూకట్‌పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో బుధవారం సాయంత్రం ఈ దారుణం చోటుచేసుకుంది. రాకేశ్ అగర్వాల్, రేణు అగర్వాల్(50) దంపతులకు ఫతేనగర్‌లో స్టీలు దుకాణం ఉంది. కుమార్తె తమన్నా ఇతర రాష్ట్రాల్లో చదువుతుండగా.. కుమారుడు శుభంతో కలిసి తల్లిదండ్రులు నివసిస్తున్నారు. స్వాన్ లేక్‌లోనే ఉండే రేణు బంధువుల ఇంట్లో ఝార్ఖండ్‌కు చెందిన రోషన్ తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్నాడు. అతడు ఝార్ఖండ్‌లోని తన గ్రామానికే చెందిన హర్ష్‌ను 11 రోజుల క్రితం రేణు ఇంట్లో వంట మనిషిగా పనికి కుదిర్చాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ