అంతర్రాష్ట్ర పశువుల దొంగల ముఠా అరెస్ట్..
మహబూబ్నగర్, 11 సెప్టెంబర్ (హి.స.) ఈజీ మనీ కోసం పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను గురువారం నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కన్మన్ కల్వ గ్రామ సమీపంలో గ్రామ సమీపంలో పట్టుకున్నట్లు మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. గు
మహబూబ్నగర్ ఎస్పీ


మహబూబ్నగర్, 11 సెప్టెంబర్ (హి.స.)

ఈజీ మనీ కోసం పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను గురువారం నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కన్మన్ కల్వ గ్రామ సమీపంలో గ్రామ సమీపంలో పట్టుకున్నట్లు మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. గురువారం నవాబుపేట పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కుమ్మరి అశోక్, సాయికుమార్, సర్దస్ అఖిల్, బుర్కా సాయి అనే నలుగురు యువకులు ఈజీ మనితో కోటీశ్వరులు కావాలనే దురుద్దేశంతో ముఠాగా ఏర్పడి గత కొంతకాలంగా రాష్ట్రంలోని యాదగిరిగుట్ట, యాలాల్, సైబరాబాద్, వికారాబాద్ నవాబుపేట కుల్కచర్ల తదితర ప్రాంతాల్లో సుమారు 16 పశువులను దొంగతనం చేశారని పోలీసుల విచారణలో వెల్లడైందని, వాటి విలువ సుమారు 14 లక్షల 50 వేల రూపాయలు ఉంటుందని ఆమె వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande