తెలంగాణ, ఆదిలాబాద్. 11 సెప్టెంబర్ (హి.స.) ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల
రిసోర్స్ సెంటర్ ప్రాంగణంలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం ప్రారంభించారు. అనంతరం ఇంటి లోపల డిజైన్, సౌకర్యాలను పరిశీలించారు.
ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి మండలానికి ఒక మోడల్ హౌస్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఎంపీ నగేష్, ఎమ్మెల్సీ దండె విఠల్, తదితరులు పాల్గొన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు