యూరియా సరఫరా కేంద్రం బాధ్యతనే.. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
కరీంనగర్, 11 సెప్టెంబర్ (హి.స.) కేంద్రం సరిగా యూరియా సరఫరా చేయకపోవడం వల్లనే ఎరువుల సమస్య వచ్చిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆరోపించారు. గురువారం కరీంనగర్ జిల్లాలో పర్యటించిన మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఎరువులకు సం
మంత్రి పొన్నం


కరీంనగర్, 11 సెప్టెంబర్ (హి.స.)

కేంద్రం సరిగా యూరియా సరఫరా చేయకపోవడం వల్లనే ఎరువుల సమస్య వచ్చిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆరోపించారు.

గురువారం కరీంనగర్ జిల్లాలో పర్యటించిన మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఎరువులకు సంబందించి రోజు కలెక్టర్తో మాట్లాడుతున్నామని, ఎరువులు రాష్ట్రంలో తయారు కావని కేంద్రంలో ఆధీనంలో తయారు జరుగుందని చెప్పారు. రైతులు ఎరువులకోసం లైన్లో నిల్చునే పరిస్థితి రావద్దని, కేంద్రం సరిగా సరఫరా చేయకపోవడం వల్ల సమస్యవచ్చిందని ఆరోపించారు. మిగతా వాటికంటే కొంత మెరుగైనా ఇక్కడ కూడా రైతులు ఎరువులకోసం లైన్లో నిల్చోవడం అనేది నాకు మంచిగా అనిపించలేదని, దానికి నేనూ కూడా భాధ్యతవహిస్తున్నా వాస్తవాలు కొన్ని ఒప్పుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

ఎరువుల సరఫరా అంతా కేంద్రం వద్దనే ఉంటదని, యూరియా రాష్ట్రానికి కేంద్రం నుండి రావాలని, సరిపడా యూరియా కేంద్రం పంపడం లేదని, యూరియా కొరతను అధిగమించేకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande