తెలంగాణ, రామగుండం. 11 సెప్టెంబర్ (హి.స.)
రాజీమార్గం రాజమార్గమని, కక్షలు,
కార్పణ్యాలతో ఏమీ సాధించలేమని, రాజీపడితే ఇద్దరూ గెలిచినట్లేనని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 13న జరుగనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు. రాజీపడదగిన కేసులలో క్రిమినల్ కంపౌండ బుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వాహణ కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు రికవరీ, టెలిఫోన్ రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులో, ఇతర రాజీ పడ్డ దగిన కేసుల్లో కక్షిదారులు రాజీ పడాలని సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు