మహబూబ్నగర్, 11 సెప్టెంబర్ (హి.స.) స్థానికంగా అందుబాటులో ఉన్న అన్ని ఆదాయ వినియోగించుకుంటూ, అవకాశాలను వనరులను పెంపొందించుకునే దిశగా వినూత్న ఆలోచనలు, పద్ధతులు, చిత్తశుద్ధితో స్థానిక సంస్థల అభివృద్ధికి కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యులతో కలిసి సమీక్ష నిర్వహించారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, నాగర్ కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్ నారాయణ పేట అదనపు కలెక్టర్ రెవెన్యూలు జిల్లాల వారీగా ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల పనితీరు గురించి చైర్మన్ కు వివరించారు. మున్సిపల్ పట్టణాలు, గ్రామ పంచాయతీలలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, తడి, పొడి చెత్త సేకరణ, పచ్చదనం పెంపు, పన్ను వసూళ్లు, స్వయం ఉపాధి పథకాల అమలు, ప్రజల జీవన ప్రమాణాల పెంపు కోసం కొనసాగుతున్న కార్యక్రమాలు, గ్రాంట్స్ రూపంలో సమకూరుతున్న ఆదాయం, ఇతర మార్గాల ద్వారా స్థానిక సంస్థలకు అందుతున్న రాబడి తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..