తెలంగాణ, వికారాబాద్. 11 సెప్టెంబర్ (హి.స.)
యూరియా కోసం వికారాబాద్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. తాము వేసిన వరి పంటకు సకాలంలో యూరియా వేయక పోవడం వలన పంట నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కోసం నెల రోజుల నుండి ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం స్పందించడం లేదని పేర్కొంటున్నారు. వికారాబాద్ జిల్లా కులకచర్ల పెద్ద గేటు చౌరస్తాలో ధర్నా నిర్వహించిన రైతులు వాహనాలను ఆపివేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ప్రతి రెండు రోజులకు ఒక సారి సగం లారీని మాత్రం తమ మండలానికి పంపిస్తే వేల ఎకరాల్లో వరిపంటను సాగుచేశామని డిమాండుకు తగ్గ ఎరువులు రాక పోవడంతోనే రైతులం ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. రైతులు ఆగ్రోసేవా కేంద్రాల దగ్గర, డీసీఎంఎస్ కేంద్రాల ద్వారా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కాని, ప్రజాప్రతినిధులు కాని వచ్చి రైతులకు ధైర్యాన్ని చెప్పలేక పోతున్నారని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు