చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద బీఆర్ఎస్వీ నేతల అరెస్ట్
హైదరాబాద్, 11 సెప్టెంబర్ (హి.స.) గ్రూప్-1 పరీక్షను తిరిగి నిర్వహించాలని, జాబ్ క్యాలెండర్ను ప్రకటించి ఉద్యోగ నోటిఫికేషన్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్తో పా
విద్యార్థి నేతలు


హైదరాబాద్, 11 సెప్టెంబర్ (హి.స.) గ్రూప్-1 పరీక్షను తిరిగి నిర్వహించాలని, జాబ్ క్యాలెండర్ను ప్రకటించి ఉద్యోగ నోటిఫికేషన్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్తో పాటు పలువురు విద్యార్థి నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని ముషీరాబాద్ పీఎస్కు తరలించారు.

ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు మేరకు గ్రూప్-1 పరీక్ష రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. టీజీపీఎస్సీ వైఫల్యం కారణంగా గ్రూప్-1 అభ్యర్థులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని, పరీక్ష నిర్వహణలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నందున హైకోర్టు సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో విచారణ జరపాలని, తెలుగు మీడియం విద్యార్థులకు పేపర్ వాల్యుయేషన్లో తీవ్ర అన్యాయం జరిగిందని, అందువల్ల ప్రస్తుత నోటిఫికేషను రద్దు చేయాలని కోరారు. అలాగే, తప్పు చేసిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టంగా డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande