తెలంగాణ, 11 సెప్టెంబర్ (హి.స.)
చింతలపాలెం మండల కేంద్రంలోని
జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలను సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల తరగతి గదులు, విద్యార్థుల హాజరు, బోధన ప్రమాణాలను కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్ వారికి పాఠశాలపై, పాఠాలపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు చదువులో మరింత ఆసక్తి చూపాలని ప్రోత్సహించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు