అమరావతి, 11 సెప్టెంబర్ (హి.స.)
: నేపాల్‌లో చిక్కుకున్న తెలువారి తరలింపుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.. నేపాల్ రాజధాని ఖాట్మండ్‌లో చిక్కుకుపోయిన తెలుగు వాళ్లలో ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్‌తో పాటు సుప్రీం కోర్టు న్యాయవాది శ్రీ నిరూప్ రెడ్డి ఉన్నారు. కుటుంబం సభ్యులు, బంధుమిత్రులు కలిపి 30 మంది ఇటీవల పశుపతినాథ్ ఆలయానికి వెళ్లారు. ప్రస్తుతం తాము ఖాట్మండ్‌లోని ఓ హోటల్లో సురక్షితంగా ఉన్నామని, తమ కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే, నేపాల్ నుంచి బీహార్ బోర్డర్ కు 22 మంది తెలుగువారిని తరలించారు.. రేపు ఖాట్మాండ్ నుంచి బయలుదేరనుంది ప్రత్యేక విమానం.. ఏపీ భవన్ అధికారులతో మంత్రి నారా లోకేష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.. రేపు రాత్రికి ఏపీకి నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారు వచ్చే అవకాశం ఉంది.. సొంత జిల్లాలకు తరలించడానికి కూడా ఏర్పాట్లు చేస్తోంది ఏపీ ప్రభుత్వం..
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ