తెలంగాణ, మెదక్. 11 సెప్టెంబర్ (హి.స.)
దేశంలోనే రెండో వన దుర్గామాత
ఆలయం, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి జలదిగ్బంధం వీడింది. 27 రోజులుగా అమ్మవారి ఆలయం జలదిగ్బంధంలోనే ఉన్న సంగతి విధితమే. భారీ వర్షాల నేపథ్యంలో సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని వదలడంతో వన దుర్గామాత ఆలయం సమీపంలో ఉన్న 30 శతకోటి ఘనపుటడుగుల వనదుర్గా ప్రాజెక్టు పూర్తిగా నిండి పొంగి పొర్లింది.
గురువారం నీటి ప్రవాహం పూర్తిగా తగ్గడంతో వేకువజామునే అమ్మవారికి అభిషేకం, అలంకరణ, అర్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించి దర్శనాన్ని పునః ప్రారంభించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు