డయేరియా ప్రభుత్వం అలెర్ట్.. కంట్రోల్​రూం ఏర్పాటు
విజయవాడ, 11 సెప్టెంబర్ (హి.స.)విజయవాడలో డయేరియా కలకలం రేగింది. న్యూరాజరాజేశ్వరిపేటలో పలువురు అస్వస్థతకు గురయ్యారు. చవితి భోజనాల్లో ఫుడ్‌పాయిజన్ కారణంగా వారంతా అస్వస్థతకు గురైనట్లు అధికారులు చెబుతున్నారు. మం చినీటి కలుషితమైందని స్థానికులు అంటున్నారు.
government-on-alert-for-diarrhea-control-room-set-up-474063


విజయవాడ, 11 సెప్టెంబర్ (హి.స.)విజయవాడలో డయేరియా కలకలం రేగింది. న్యూరాజరాజేశ్వరిపేటలో పలువురు అస్వస్థతకు గురయ్యారు. చవితి భోజనాల్లో ఫుడ్‌పాయిజన్ కారణంగా వారంతా అస్వస్థతకు గురైనట్లు అధికారులు చెబుతున్నారు. మం చినీటి కలుషితమైందని స్థానికులు అంటున్నారు. దీంతో వెంటనే ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. అధికారులు ఇంటింటి సర్వే ద్వారా నీటి శాంపిల్స్‌ సేకరిస్తున్నారు. అస్వస్థతకు గురైన బాధితులను మంత్రి నారాయణ, ఎమ్మెల్యే బోండా ఉమ పరామర్శించారు. డయేరియా ప్రబలిన ప్రాంతాల పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులను కలెక్టర్‌ లక్ష్మీశ పరామర్శించారు.

22 మంది డిశ్చార్జ్‌ అయ్యారని, 41 మందికి చికిత్స అందిస్తున్నాం అని కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు. 91549 70454 కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు ఏర్పాటు చేశామని రాజరాజేశ్వరి పేటలో 24 గంటల వైద్యసేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కాగా న్యూ రాజరాజేశ్వరి పేటలో బుధవారం వాంతులు, విరేచనాలతో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే వీరిలో నాగమణి అనే మహిళ మృతి చెందారు. మరో 22 మందికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మంచినీటి కాలుష్యమే స్థానికులు చెబుతున్నారు. రెండు రోజుల నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande