కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. ఏకంగా 11 మంది ఐఎఫ్‌ఎస్‌ల బదిలీ
అమరావతి, 11 సెప్టెంబర్ (హి.స.)పాలనాపరమైన వ్యవహారాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కార్ (AP Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మొత్తం 11 మంది ఐఎఫ్ఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు
కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. ఏకంగా 11 మంది ఐఎఫ్‌ఎస్‌ల బదిలీ


అమరావతి, 11 సెప్టెంబర్ (హి.స.)పాలనాపరమైన వ్యవహారాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కార్ (AP Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మొత్తం 11 మంది ఐఎఫ్ఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. పర్యావరణ అభివృద్ధి కార్పొరేషన్‌ ఎండీగా రాజేంద్రప్రసాద్, అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ ఎండీగా ఎస్‌.ఎస్‌.శ్రీధర్, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా శ్రీ శర్వాణన్ నియమితులయ్యారు. అదేవిధంగా అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ రీజినల్‌ మేనేజర్‌గా శ్రీకాంతనాథ రెడ్డి, శ్రీశైలం ప్రాజెక్టు టైగర్‌ సర్కిల్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌గా బి.విజయ్‌కుమార్‌, కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ కర్నూలు సర్కిల్‌గా బి.వి.ఎ.కృష్ణమూర్తి నియమిస్తూ ఆర్డర్స్ వెలువడ్డాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande