TTD బోర్డు 29వ సభ్యుడిగా సుదర్శన్ వేణు.. అధికారిక ఉత్తర్వులు జారీ
తిరుమల , 11 సెప్టెంబర్ (హి.స.)తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు బోర్డులో 29వ సభ్యుడిగా సుదర్శన్ వేణును నియమిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, గతంలో 29 మందితో టీటీడీ బోర్డును ఏర్పాటు చేసినప్
TTD బోర్డు 29వ సభ్యుడిగా సుదర్శన్ వేణు.. అధికారిక ఉత్తర్వులు జారీ


తిరుమల , 11 సెప్టెంబర్ (హి.స.)తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు బోర్డులో 29వ సభ్యుడిగా సుదర్శన్ వేణును నియమిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, గతంలో 29 మందితో టీటీడీ బోర్డును ఏర్పాటు చేసినప్పటికీ వారిలో సభ్యుడిగా ఉన్న జస్టిస్ హెచ్ఎల్ దత్తు బాధ్యతలు చేపట్టలేదు. దీంతో ఆయన స్థానంలో సుదర్శన్ వేణును సభ్యుడిగా నియమిస్తూ సర్కార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande