ఖాట్మండూ నుంచి ఏపీకి బయలుదేరిన తెలుగు పౌరులు
ఖాట్మండూ , 11 సెప్టెంబర్ (హి.స.)మంత్రి లోకేష్(Minister Lokesh) చొరవతో నేపాల్‌లోని పోఖరా నుంచి 10 మంది తెలుగుపౌరులు(Telugu Citizens) మధ్యాహ్నం 12:40 గంటలకు ప్రత్యేక విమానం(Special Flight)లో బయల్దేరి 1:15 గంటలకు ఖాట్మండూ చేరుకున్నారు. అనంతరం ఖాట్మండూ(K
ఖాట్మండూ నుంచి ఏపీకి బయలుదేరిన తెలుగు పౌరులు


ఖాట్మండూ , 11 సెప్టెంబర్ (హి.స.)మంత్రి లోకేష్(Minister Lokesh) చొరవతో నేపాల్‌లోని పోఖరా నుంచి 10 మంది తెలుగుపౌరులు(Telugu Citizens) మధ్యాహ్నం 12:40 గంటలకు ప్రత్యేక విమానం(Special Flight)లో బయల్దేరి 1:15 గంటలకు ఖాట్మండూ చేరుకున్నారు. అనంతరం ఖాట్మండూ(Kathmandu) నుంచి విశాఖ(Visakha) బయలుదేరే ఇండిగో విమానం(Indigo flight)లోనే వారిని కూడా రాష్ట్రానికి తరలిస్తున్నారు. ఖాట్మండూ నుంచి ఏపీ పౌరులను రాష్ట్రానికి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఆర్‌టీజీ‌ఎస్ వార్ రూమ్ నుంచి మంత్రి లోకేష్ నిర్వహించిన సమీక్షలో ఢిల్లీ ఏపీ భవన్ ప్రత్యేకాధికారి అర్జా శ్రీకాంత్, మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేష్, జనసేన నాయకులు చిల్లపల్లి శ్రీనివాసరావు, బండిరెడ్డి రాము, సీనియర్ ఐఏఎస్ అధికారులు ముఖేష్ కుమార్ మీనా, కోన శశిధర్, కాటంనేని భాస్కర్, కృతిక శుక్లా, అజయ్ జైన్, నారాయణ భరత్ గుప్తా, ప్రఖర్ జైన్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నేపాల్ నుంచి రాష్ట్రానికి రాబోతున్న వారికి స్వాగతం పలికేందుకు కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు ఆయా ఎయిర్ పోర్టులకు భారీగా చేరుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande