అమరావతి, 12 సెప్టెంబర్ (హి.స.)డయేరియాపైఏపీ ప్రభుత్వ పరంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్( )పేర్కొన్నారు. న్యూ రాజరాజేశ్వరి పేటలో ప్రస్తుతం డయేరియా పరిస్థితి అదుపులో ఉందని చెప్పుకొచ్చారు. ఇవాళ(శుక్రవారం) న్యూ రాజరాజేశ్వరి పేటలో మంత్రి సత్యకుమార్ యాదవ్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), కలెక్టర్ లక్ష్మీశా, మున్సిపల్ కమిషనర్ ధ్యాన చంద్ర పర్యటించారు. మెడికల్ క్యాంపులో రోగులతో మంత్రులు సత్యకుమార్, నారాయణ, ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడారు. అనంతరం మీడియాతో మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ