ఎస్సారెస్పీని సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తులు..
హైదరాబాద్, 13 సెప్టెంబర్ (హి.స.) నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ లో గల శ్రీరాంసాగర్ ప్రాజెక్టును రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.సామ్ కోషి, జస్టిస్ సృజన శనివారం సందర్శించారు. పొరుగున ఉన్న నిర్మల్ జిల్లాలో పర్యటన ముగించుకుని తిరుగ
Srsp


హైదరాబాద్, 13 సెప్టెంబర్ (హి.స.)

నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ లో గల శ్రీరాంసాగర్ ప్రాజెక్టును రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.సామ్ కోషి, జస్టిస్ సృజన శనివారం సందర్శించారు. పొరుగున ఉన్న నిర్మల్ జిల్లాలో పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఎస్సారెస్పీని సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తులను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన అనంతరం, హైకోర్టు జడ్జిలు కలెక్టర్తో భేటీ అయ్యి ఎస్సారెస్పీ ప్రాజెక్టు గురించి, జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande