అమరావతి, 13 సెప్టెంబర్ (హి.స.)
విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాను అనుకొని అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపారు. సముద్ర తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉందని.. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. పశ్చిమ మధ్య తీరానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ