ఆత్మకూరు గురుకుల .పాఠశాలలో విషజ్వరాలలో కలకలం.పై. మంత్రి.ఆనం
అమరావతి, 13 సెప్టెంబర్ (హి.స.) నెల్లూరు: ఆత్మకూరు బాలికల గురుకుల పాఠశాలలో విషజ్వరాల కలకలంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌తోపాటు అన్ని స్థాయుల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంబంధిత అధికారులతో
ఆత్మకూరు  గురుకుల .పాఠశాలలో విషజ్వరాలలో కలకలం.పై. మంత్రి.ఆనం


అమరావతి, 13 సెప్టెంబర్ (హి.స.)

నెల్లూరు: ఆత్మకూరు బాలికల గురుకుల పాఠశాలలో విషజ్వరాల కలకలంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌తోపాటు అన్ని స్థాయుల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంబంధిత అధికారులతో పాటు రెవెన్యూ, పోలీస్, విద్యాశాఖ, మున్సిపల్ అధికారులు గురుకుల పాఠశాల వద్దకు వెళ్లి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జ్వరాల బారిన పడిన విద్యార్థినులను జిల్లా వైద్యశాలకు తరలించి తక్షణ వైద్యం అందించాలని పేర్కొన్నారు. మంత్రి ఆదేశాలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వైద్య బృందాలు ఆత్మకూరు వెళ్లాయి. విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. విద్యార్థుల విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande