కర్నూలు, 12 సెప్టెంబర్ (హి.స.)
:అనంతపురం, ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలో 12.9, అనంతలోని యల్లనూరు మండలంలో 10.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు రాక పోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాల పంటలు నీట మునిగాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ