అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన..
హైదరాబాద్, 12 సెప్టెంబర్ (హి.స.) శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్, ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో ఆరున్నర కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ శుక్రవా
ఎమ్మెల్యే గాంధీ


హైదరాబాద్, 12 సెప్టెంబర్ (హి.స.)

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని

వివేకానంద నగర్, ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో ఆరున్నర కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. ఉషా ముళ్లపూడి కమాన్ నుండి ఆల్విన్ కాలనీ వరకు రోడ్డు వెడల్పు కోసం చెట్ల తొలగింపు కరెంటు పోల్స్ మార్పుతో పాటు, రోడ్డు మార్కింగ్, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనుల్లో భాగంగా శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే గాంధీ వెల్లడించారు.

రోడ్డు వెడల్పులో ఇల్లు కోల్పోతున్న వారికి న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. రాబోయే భవిష్యత్తు తరాలకు పెరుగుతున్న ట్రాఫిక్ అనుగుణంగా ఈ చర్యలను తీసుకున్నామని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande