హైదరాబాద్, 12 సెప్టెంబర్ (హి.స.)
గోదావరి పరివాహక ప్రాంతాల్లోని
ఆలయాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అదేవిధంగా రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో శాశ్వత ఘాట్ల నిర్మాణం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇవాళ బంజారా హిల్స్ లోని ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో గోదావరి పుష్కరాలకు సన్నద్ధత, ముందస్తు ప్రణాళికలపై దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మంత్రి కొండా సురేఖ తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లపై కీలక సూచనలుచ చేశారు. టెంపుల్ సెంట్రిక్ ఘాట్స్ అభివృద్ధికి ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రముఖ ఆలయాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని శాశ్వత ఘాట్స్ నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు