యూరియా కోసం తిప్పలు.. అర్ధరాత్రి నుంచి క్యూ లైన్లో మహిళలు
తెలంగాణ, జోగులాంబ గద్వాల. 12 సెప్టెంబర్ (హి.స.) ప్రభుత్వం రైతులకు యూరియా అందించలేక రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని అర్ధరాత్రి నుంచి క్యూ లైన్లో నిలబడిన ఫలితం మాత్రం దక్కడం లేదని యూరియా అందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం జోగ
యూరియా తిప్పలు


తెలంగాణ, జోగులాంబ గద్వాల. 12 సెప్టెంబర్ (హి.స.)

ప్రభుత్వం రైతులకు యూరియా

అందించలేక రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని అర్ధరాత్రి నుంచి క్యూ లైన్లో నిలబడిన ఫలితం మాత్రం దక్కడం లేదని యూరియా అందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రైతులకు యూరియా కోసం టోకెన్లను అందిస్తుండటంతో యూరియా కోసం భారీ క్యూ లైన్ లో రైతులు, మహిళలు నిలబడ్డారు.

కేవలం ఒక రైతుకు రెండు బస్తాల యూరియా మాత్రమే అందిస్తున్నారని, సమృద్ధిగా వర్షాలు కురుస్తున్న ప్రభుత్వం సకాలంలో యూరియా అందించలేకపోతుందని రైతులు తెలిపారు. ఇంట్లో పనులు, వ్యవసాయ పనులు వదులుకొని ప్రతిరోజు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నామని రైతులు తెలిపారు. అర్ధరాత్రి నుంచి క్యూ లైన్ లో నిలబడిన యూరియా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాటు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande