ప్రజా పాలనలో సొంతింటి కల సాకారం.. మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణ, సిద్దిపేట. 12 సెప్టెంబర్ (హి.స.) ప్రజా పాలన ప్రభుత్వంలో పేదల ఇంటి కల నెరవేర్చడానికి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం తోటపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ది
మంత్రి పొన్నం


తెలంగాణ, సిద్దిపేట. 12 సెప్టెంబర్ (హి.స.)

ప్రజా పాలన ప్రభుత్వంలో పేదల ఇంటి కల నెరవేర్చడానికి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం తోటపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల నూతన గృహ ప్రవేశం కార్యక్రమంలో శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు. మొదటి దశలో మంజూరు అయిన ఇందిరమ్మ ఇళ్లు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. చాలా చోట్ల ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేసుకొని గృహ ప్రవేశాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది అన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ తదితర ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమవతి, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, ఆర్డీవో రామ్మూర్తి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు తతరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande