గాంధీ ఆసుపత్రి పారిపాలనా విభాగంపై సర్కార్ ఫుల్ ఫోకస్..
హైదరాబాద్, 12 సెప్టెంబర్ (హి.స.) గాంధీ ఆసుపత్రి పారిపాలనా విభాగంపై రేవంత్ సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి ని ఆ పోస్టు నుంచి తప్పిస్తూ వైద్య,ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టీనా గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశా
గాంధీ ఆసుపత్రి


హైదరాబాద్, 12 సెప్టెంబర్ (హి.స.)

గాంధీ ఆసుపత్రి పారిపాలనా విభాగంపై రేవంత్ సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి ని ఆ పోస్టు నుంచి తప్పిస్తూ వైద్య,ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టీనా గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె పనితీరుపై గత కొంత కాలంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విషయంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే డాక్టర్ రాజకుమారి సంబంధిత శాఖ క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించినట్లుగా తెలుస్తోంది. అయితే, వైద్య, విద్య అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ వాణికి గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ తాజాగా అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande