లోయలు పడిపోయిన యూపీ ఆర్టీసీ బస్సు.. ఐదుగురు దుర్మరణం
హైదరాబాద్, 12 సెప్టెంబర్ (హి.స.) రోడ్డు ప్రమాదం లో అక్కడికక్కడే ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హర్దోయ్ నుంచి లక్నో వైపు వెళ్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు
యూపీ ఆక్సిడెంట్


హైదరాబాద్, 12 సెప్టెంబర్ (హి.స.)

రోడ్డు ప్రమాదం లో అక్కడికక్కడే ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హర్దోయ్ నుంచి లక్నో వైపు వెళ్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు కాకోరి ప్రాంతంలో బ్రిడ్జ్ పైనుంచి 40 అడుగుల లోతైన లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం ఐదురుగు ప్రయాణికులు తీవ్ర గాయాలతో స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా మరో 18 మంది తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కాకోరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. అయితే, బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఓ వాటర్ ట్యాంకర్తో ఢీకొని బ్రిడ్జ్ నుండి పడిపోయినట్లుగా పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో మలిహాబాద్ పోలీసులు, ఫైర్ బ్రిగేడ్ స్పాట్ హుటాహుటిన చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande