మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. సెంట్రల్ కమిటీ సభ్యురాలు కల్పన అరెస్ట్?
హైదరాబాద్, 12 సెప్టెంబర్ (హి.స.) ఆపరేషన్ కగార్ లో భాగంగా మావోయిస్టులకు మరో ఊహించని షాక్ తగిలింది. ఈ మేరకు సీపీఐ మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యురాలు కల్పన అలియాస్ సుజాత అలియాస్ మైనక్కను పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.
మావోయిస్టు


హైదరాబాద్, 12 సెప్టెంబర్ (హి.స.)

ఆపరేషన్ కగార్ లో భాగంగా మావోయిస్టులకు మరో ఊహించని షాక్ తగిలింది. ఈ మేరకు సీపీఐ మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యురాలు కల్పన అలియాస్ సుజాత అలియాస్ మైనక్కను పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. ఆమెతో పాటు మరో ముగ్గురు మావోయిస్టు సభ్యులు కూడా వారి అదుపులో ఉన్నట్లుగా సమాచారం. ఇవాళ సాయంత్రం లోపు కల్పన అరెస్టులు ధృవీకరించే అవకాశం ఉంది. కాగా, నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరుకు చెందిన కల్పన 1983లో ఆర్ఎస్ఈయ్యూ (RSU)లో పని చేస్తూనే మావోయిస్టు పార్టీలోకి వెళ్లారు. లాల్గఢ్ ఉద్యమ నేత సీపీఐ మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు బెంగాల్ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన మల్లోజుల కోటేశ్వర రావు ను వివాహం చేసుకున్నారు. సుదీర్ఘ కాలం ఛత్తీస్గఢ్ లో పని చేసిన కల్పన అక్కడి జనతన సర్కార్ల ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించారు. మావోయిస్టుల ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించిన కల్పన అలియాస్ సుజాతపై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో రూపాయలకిపైగా రివార్డు ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande