సర్కార్ నడుపుతున్నారా? సర్కస్ నడుపుతున్నారా?.. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫెర్
హైదరాబాద్, 12 సెప్టెంబర్ (హి.స.) కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రేవంత్ సర్కార్ పరిపాలనను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. యాకుత్పురాలో మ్యాన్హాల్లో చిన్నారి పడిపోయిన ఘటనపై కేటీఆర్ తీవ్రంగా స్
కేటీఆర్


హైదరాబాద్, 12 సెప్టెంబర్ (హి.స.) కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రేవంత్ సర్కార్ పరిపాలనను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. యాకుత్పురాలో మ్యాన్హాల్లో చిన్నారి పడిపోయిన ఘటనపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.

అసలు రేవంత్ రెడ్డి సర్కార్ నడుపుతున్నారా..? సర్కస్ నడుపుతున్నారా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల నగరంలో నిన్న ఒక చిన్నారి తెరిచి ఉంచిన మ్యాన్హాల్లో పడిపోయిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అదృష్టవశాత్తూ పాప ప్రాణాలు దక్కాయి. లేదంటే ఆమె కుటుంబానికి పుట్టెడు శోకం కలిగి ఉండేదన్నారు.

అయితే చేసిన తప్పును దిద్దుకోవాల్సిన మున్సిపల్ శాఖలోని మూడు విభాగాలేమో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. తప్పు హైడ్రాది అని జీహెచ్ఎంసీ ప్రకటిస్తే.. తప్పు మాది కాదు జలమండలిది అని హైడ్రా చేతులు దులుపుకుంది. ఆ వెంటనే అసలు మాకేం సంబంధం లేదని జలమండలి చేతులెత్తేసింది! అని కేటీఆర్ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande