తిరుపతి, 12 సెప్టెంబర్ (హి.స.)
:తిరుపతిలో రీజనల్ టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్( )మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన ఇవాళ(శుక్రవారం) జరుగనుంది. పర్యాటక రంగ అభివృద్ధి, అవకాశాలు, ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని ఈ సమ్మిట్‌లో వివరించనున్నారు మంత్రి కందుల దుర్గేష్. ఇన్వెస్టర్స్‌తో, హోమ్ స్టే ఆపరేటర్స్‌తో ప్రత్యేకంగా మంత్రి దుర్గేష్ చర్చించనున్నారు. తిరుపతిలోని తాజ్ హోటల్‌లో ఈ సమ్మిట్ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు ఏపీటీడీసీ అధికారులు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ