తిరుపతి:, 12 సెప్టెంబర్ (హి.స.)
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారులు వీరికి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వీరికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ