తిరుమల, 12 సెప్టెంబర్ (హి.స.)భక్తుల కొంగుబంగారం శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. రెండో శనివారం, ఆదివారం వరుస సెలవులు రావడంతో ఇవాళ స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి దాదాపు 26 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) 6 నుంచి 8 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntam Que Complex) భక్తులతో కిక్కిరిసిపోయి క్యూ లైన్ శిలాతోరణం దాటి దాదాపు 2 కిమీ. మేర కొనసాగుతోంది. గురువారం స్వామి వారిని 66,312 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 27,728 మంది భక్తలు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.3.81 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు (TTD Offcials) తెలిపారు. మరోవైపు భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్‌లో శ్రీ వేంకటేశ్వ స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు మజ్జిగ, పాలు, మంచినీరు, అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి