అమరావతి, 12 సెప్టెంబర్ (హి.స.)రాష్ట్రంలో కొత్త రేషన్ పాలసీ(New Ration Polocy)ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విధానంలో కొన్ని తప్పులు దొర్లాయి. దీంతో ప్రభుత్వం(Government) అలర్ట్ అయింది. కీలక ప్రకటన చేసింది. ప్రజలకు వచ్చే 30 వరకు సమయం ఇచ్చింది.
ఇటీవల రాష్ట్రంలో రేషన్ కార్డు(Ration Cards)ల విధానంలో మార్పులు చేశారు. రేషన్‌దారులందరికీ స్మార్ కార్డులు పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 80 శాతం కుటుంబాలకు ఈ కార్డులు అందజేశారు. అయితే కొన్ని కార్డుల్లో తప్పులు దొర్లాయి. అక్షర దోషాలుండటంతో కార్డు హోల్డర్లు అందోళన చెందుతున్నారు. పేర్లు, వయసు, ఇంటి నెంబర్లు తప్పుగా పడటంతో ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పేర్లలో తప్పులు, మార్పులు చేసుకునేందుకు ఈ నెల 30 వరకూ సమయం ఇచ్చింది. ఈ విషయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) స్వయంగా ప్రకటించారు. కార్డుల్లో తప్పులు ఉంటే సచివాలయాల్లో ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. అక్టోబర్ 30 వరకు కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి