అమరావతి, 13 సెప్టెంబర్ (హి.స.)రాష్ట్ర అటవీశాఖలో 2024-25 ప్యానల్ సంవత్సరానికి 15 మంది అసిస్టెంట్ కన్జర్వేటర్లకు డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (డీసీఎఫ్)గా స్టేట్ క్యాడర్‌లో తాత్కాలిక పదోన్నతి లభించింది. వీరికి పోస్టింగులు ఇస్తూ అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతీలాల్‌దండే శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్ల డీసీఎఫ్‌వోగా ఎస్ రవిశంకర్, తిరుపతి సోషల్ ఫారెస్ట్ డీఎ్‌ఫవోగా జీఎన్ పవన్‌కుమార్, శ్రీసత్యసాయి జిల్లా డీసీఎఫ్‌వోగా టీ చక్రపాణి, అన్నమయ్య జిల్లా సోషల్ ఫారెస్ట్ డీసీఎఫ్‌వోగా ఎన్ శివకుమార్ సంగల, హెచ్‌వోఎ్‌ఫఎ్‌ఫ ఆఫీ్‌సలో డీసీఎఫ్ (ఎన్సీ)గా కె.సోమశేఖరం, అనంతపురం సోషల్ ఫారెస్ట్ డీఎ్‌ఫవోగా ఎం.గురుప్రభాకర్, హెచ్‌వోఎఫ్ఎఫ్ ఆఫీస్‌లో వైల్డ్‌లైఫ్ డీసీఎ్‌ఫగా ఎ.శ్రీనివాసులు, రాజమండ్రిలోని ఫారెస్ట్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా వి.హరిగోపాల్, అనకాపల్లి సోషల్ ఫారెస్ట్ డీఎ్‌ఫవోగా ఎం.సోమసుందరం, హెచ్‌వోఎఫ్ ఎ ఫ ఆఫీ్‌సలో డీసీఎఫ్(పీఎంయూ2)గా సీహెచ్.నాగభూషణం, శ్రీసత్యసాయి జిల్లా సోషల్ ఫారెస్ట్ డీఎ్‌ఫవోగా జి.శ్రీనివాసులు, కోనసీమ జిల్లా డీసీఎఫ్‌వోగా ఎంవీ.ప్రసాదరావులకు పోస్టింగులు ఇచ్చారు. పంచాయతీరాజ్‌శాఖలో జాయింట్ కమిషనర్(ప్లాంటేషన్)గా పనిచేస్తున్న ఎన్‌వీ. శివరాంప్రసాద్, ఔషధ, సుగంధ మొక్కల బోర్డు సీఈవో ఎ.చంద్రశేఖర్‌ను తిరిగి అవే పోస్టులో కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ