అమరావతి, 13 సెప్టెంబర్ (హి.స.)
తిరుపతి: తిరుపతి జిల్లా తుంగపాలెంలోని రేకుల పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ