అమరావతి, 13 సెప్టెంబర్ (హి.స.)
మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుంది. ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో ఉద్యోగులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ప్రాణ నష్టం ఏమీ లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఎంతమేరకు ఆస్తినష్టం జరిగిందో ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ