హైదరాబాద్, 13 సెప్టెంబర్ (హి.స.)
ఆసియా కప్ 2025 లో భాగంగా నెల
14న (ఆదివారం) భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఆసక్తికరమైన మ్యాచ్ ఉంది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ జట్టుతో ఎటువంటి మ్యాచులు ఆడవద్దని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ నిర్వాహణపై అనేక అనుమానాలు ఉన్నాయి. అయితే రేపు రాత్రి ఈ మ్యాచ్ జరగనుండగా.. ఇందులో పాల్గొనడంపై గాని పాల్గొనకపోవడంపై గాని ఇరు దేశాల నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. దీంతో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసం కోట్లాది మంది అభిమానులు వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ VS పాకిస్తాన్ మ్యాచ్ గురించి బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ACC, ICC టోర్నమెంట్లను నిర్వహించినప్పుడు, దేశాలు పాల్గొనడం తప్పనిసరి అవుతుంది. ఏ దేశమైనా ఇలాంటి టోర్నమెంట్లో ఆడకపోతే.. ఆ దేశ జట్టు టోర్నమెంట్ నుండి తొలగించబడుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు