గ్రూప్-1 వివాదం.. కేటీఆర్ పై కాంగ్రెస్ ఫిర్యాదు
హైదరాబాద్, 13 సెప్టెంబర్ (హి.స.) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఓయూ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. గ్రూప్-1 పరీక్షపై ప్రభుత్వ ప్రతిష్టకు భంగంగలించే అసత్య ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ పై టీపీసీసీ జనరల్ సెక్రటరీ దయాకర్
గ్రూప్ వన్ కేటీఆర్


హైదరాబాద్, 13 సెప్టెంబర్ (హి.స.)

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఓయూ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. గ్రూప్-1 పరీక్షపై ప్రభుత్వ ప్రతిష్టకు భంగంగలించే అసత్య ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ పై టీపీసీసీ జనరల్ సెక్రటరీ దయాకర్ పోలీసులకు ఇవాళ ఫిర్యాదు చేశారు. గ్రూప్ -1 విషయంలో వస్తున్న ఆరోపణలను ఖండించిన దయాకర్.. బీఆర్ఎస్ అధికారిక ఎక్స్ ఖాతా లో రూ. 3 కోట్లు కొట్టు గ్రూప్-1 పోస్టు పట్టు! అని పోస్టు చేశారని ఈ విషయంలో కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. గ్రూప్-1 విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను ఖండించిన దయాకర్. 24 గంటల్లోకేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande